వాగ్నర్‌ తిరుగుబాటు..రష్యాకు వెన్నుపోటు : పుతిన్‌

నవతెలంగాణ-హైదరాబాద్ : వాగ్నర్ గ్రూప్‌ అధిపతి ప్రిగోజిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తీవ్రంగా మండిపడ్డాడు. ఈ సమయంలో దేశ ప్రజలను రక్షించుకునేందుకు తాను ఏమైనా చేస్తానని హెచ్చరించారు. వాగ్నర్ గ్రూప్‌ తిరుగుబాటు నేపథ్యంలో.. దేశ ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘సొంతలాభం కోసం వాగ్నర్‌ గ్రూప్ అధిపతి ద్రోహం చేస్తున్నారు. ఇది రష్యాకు వెన్నుపోటు. ఇది దేశ ద్రోహచర్య. దీనికోసం ఆయుధాలు చేతపట్టినవారిపై కఠిన చర్యలు తప్పవు. దేశ ప్రజలు రక్షించుకునేందుకు ఎలాంటి చర్యలైనా తీసుకుంటాను’అని తీవ్ర హెచ్చరికలు పంపారు. పుతిన్ ప్రసంగానికి ముందు రక్షణ మంత్రి వాగ్నర్ సైన్యంతో మాట్లాడారు. ‘మీరంతా మెసానికి గురయ్యారు. మిమ్మల్ని ఒక నేరంలోకి నెట్టేశారు’ అని అన్నారు. వారంతా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. దానికి బదులుగా వారి భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు.

Spread the love