నవతెలంగాణ-తలకొండపల్లి
మండల పరిధిలోని గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని చేపట్టిన దీక్షలు బుధవారంతో 17 రోజుకు చేరింది. మంగళవారం ఉదయం జిల్లా డీపీఓతో పాటు, స్థానిక ఎంపీడీవోకు ఉప సర్పంచ్ బాలస్వామి, 11 మంది వార్డు సభ్యులు తమ రాజీనామా పత్రాలను అధికారికంగా అధికారులకు అందజేశారు. గ్రామంలో దీక్షలు ప్రారంభమైన మొదట్లో సర్పంచ్ నామమాత్రంగా దీక్షలో కూర్చుని వెళ్లిపోయేవాడని పాలకవర్గం సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సర్పంచ్ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో జయమ్మ వెంకటయ్య రాజీనామా చేయడం లేదని వార్డు సభ్యులు ఆరోపించారు. సర్పంచ్ స్పందించకపోవడంతో వార్డు సభ్యులు బుధవారం సర్పంచ్ గదికి మాత్రమే తాళం వేశారు. సర్పంచ్ సైతం స్పందించి మండల కేంద్రం ఏర్పాటు కోసం చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బాలస్వామి, వార్డు సభ్యులు డేరంగుల కృష్ణవేణి, దేశమని రాములు, బోయ వెంకటమ్మ, సుజాత రెడ్డి, కల్యంకార్ రమేష్, నరేందర్ గౌడ్, జోలం రమేష్, , ఆలూరి ఈశ్వరమ్మ, పెంటమాల విజయలక్ష్మి, ఏదుల మహేష్, ఏదుల యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.