
బిసి ఎన్ఆర్ఐలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేస్తామని ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షులు బట్టు స్వామి శనివారం తెలిపారు. తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ నిర్ణయ అనుసారం ఎన్ఆర్ఐ కువైట్ అధ్యక్షులు బట్టు స్వామి ఆధ్వర్యంలో తెలంగాణ సంక్షేమ సంఘం ఎన్నారై బాల్కొండ మండల అధ్యక్షులుగా సాకలి మల్కన్నను నియమించడం జరిగిందని బిసి జిల్లా నాయకులు గగ్గుపల్లి శ్యామ్ తెలిపారు. ఈ సందర్భంగా సాకలి మలకన్న మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటారని, ,బిసి ఎన్నారై లకు ఎటువంటి సమస్యలు వచ్చిన వారికి అండగా ఉంటానని ఎల్లవేళలా బిసి సంక్షేమ సంఘం కోసం పాటుపడతారని మల్కన తెలిపారు.ఈ కార్యక్రమంలో రాజశేఖర్, సత్యం, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.