గడపగడపకు సంక్షేమం.. వెలకట్టలేని సంతోషం

– తెలంగాణ ఫుడ్స్‌ చైర్మన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
సీఎం కేసీఆర్‌ తీసుకొచ్చిన సంక్షేమ పథóకాల వల్ల రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారని తెలంగాణ ఫుడ్స్‌ చైర్మెన్‌ మేడే రాజీవ్‌ సాగర్‌ తెలిపారు. సబ్బండ వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పార్టీ ముందుకు సాగుతున్నదన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని వివరించారు. ప్రతి సంక్షేమ పథకాన్నీ, రూపకల్పనలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకునే రూప కల్పన చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో అమల వుతున్న సంక్షేమ పథకాలనే ఇప్పుడు దేశమంతా ఆచరి స్తున్నదని వివరిం చారు. ఈ మేరకు రాజీవ్‌ సాగర్‌ శుక్రవారం ఒక  ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందని ఇల్లు లేదని తెలిపారు.

Spread the love