ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌లో 6% పతనం వెస్టియన్‌ వెల్లడి

హైదరాబాద్‌ : దేశంలో కొత్త వ్యాపారాల విస్తరణలో మందగమనం చోటు చేసుకుంటుంది. ప్రస్తుత ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీసు స్పేస్‌ డిమాండ్‌లో 6 శాతం తగ్గుదల నమోదయ్యిందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ సంస్థ వెస్టియన్‌ వెల్లడించింది. గడిచిన ఏప్రిల్‌- జూన్‌ కాలంలో ఆఫీసు స్పేస్‌ అద్దె 13.9 మిలియన్‌ చదరపు ఆడుగులకు తగ్గిందని.. గతేడాది ఇదే కాలంలో 14.8 మిలియన్‌ చదరపు అడుగులుగా చోటు చేసకుందని పేర్కొంది. మరోవైపు బెంగళూరు, చెన్నరు, హైదరాబాద్‌ నగరాలు మొత్తం ఆఫీసు లిజింగ్‌లో 8.2 మిలియన్‌ చదరపు అడుగుల విస్త్తీర్ణంతో ఏకంగా 59 శాతం వాటాను కలిగి ఉన్నాయని వెస్టియన్‌ పేర్కొంది. ముంబయి, పూణె, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌, కోల్‌కత్తా నగరాలను ఈ రిపోర్ట్‌లో పరిగణలోకి తీసుకుంది.