ఊరెళ్ళి వచ్చేసరికి ఇల్లు గుల్ల..

నవతెలంగాణ – మీర్ పేట్
ఊరెళ్ళి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి ఆభరణాలు ఎత్తుకెళ్లిన ఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ కే కిరణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ వెంకటాద్రి నివాస్ లో సాపటేళ్ల వెంకటప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. బుధవారం(21-06-2023) తన స్వంత గ్రామం అయిన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం గుండెపల్లికి వెళ్లాడు. గురువారం తిరిగి బడంగ్ పేట్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు ప్రధాన తలుపులకు తాళం పగలగొట్టి ఉంది అనుమానంతో బెడ్ రూంలోకి వెళ్లి చూడగా బీరువా సైతం పగలగొట్టి అందులోని 9.5తులాల బంగారు ఆభరణాలు, 5తులాల వెండి, కొంత డబ్బులు కనిపించకపోవడంతో మీర్ పేట్ పోలీసులకు సమాచారం అందించారు. దింతో మీర్ పేట్ పోలీసులు క్లూస్ టీంతో సంఘటన స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ కె కిరణ్ కుమార్ తెలిపారు. ప్రజలు ఇండ్లలో దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు బంగారు ఆభరణాలు, డబ్బులు తమ వెంటనే తీసుకుని వెళ్లాలని సూచించారు.

Spread the love