రాంగ్ సిగ్నల్…బాలేశ్వర్​లో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

balasore-averted-alert-memu-train-pilot-saves-livesనవతెలంగాణ – ఒడిశా
ఒడిశా బాలేశ్వర్​లో త్రుటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. సిగ్నలింగ్​లో లోపం వల్ల మరమ్మతులు జరుగుతున్న లూప్​ లైన్​లోకి ప్రవేశించింది రైలు. లోకోపైలట్​ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. లూప్​లైన్​ పనులు జరుగుతున్న విషయాన్ని గమనించిన లోకోపైలట్​.. వెంటనే బ్రేకులు వేశాడు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించి పనులు జరుగుతున్న లైన్​లోకి సిగ్నల్ ఇవ్వడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న సాంకేతిక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిగ్నలింగ్​లో తలెత్తిన లోపాన్ని సరిదిద్ది.. రైలు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనతో భద్రక్ నుంచి బాలేశ్వర్​ లైనులో రైళ్ల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. మరమ్మతు చేస్తున్న లైనులోకి అలానే వెళ్లుంటే.. ఘోర ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు వాపోయారు.

Spread the love