యాసంగి జొన్న పంటను కొంటాం

– సీఎం నిర్ణయం పట్ల వేముల హర్షం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో పండిన యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరిస్తుందని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన సీఎంకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియ జేశారు. రైతు పక్షపాతిగా ఉన్న సీఎం ఎప్పుడూ రైతుకు కష్టం రానివ్వరనీ, రైతులను కంటికి రెప్పలా కాపాడుకునే మనసున్న నేత అని కొనియాడారు. రైతు సంక్షేమం కోసం కేసీఆర్‌ మరెవరూ కనీసం ఆలోచన చేయలేరని తేల్చి చెప్పారు. రైతుకు భరోసా కల్పించడంలో కేసీఆర్‌ తర్వాతే ఎవరైనా అని తెలిపారు. కామారెడ్డి, నిజామాబాద్‌ పరిధిలో జొన్న పంటను పండించిన రైతులకు లబ్ది చేకూరనున్నదని వేములు ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love