పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి: వై ఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
పేపర్‌ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులకు కేసీఆర్‌ ద్రోహం చేశారని విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన 80 వేల ఉద్యోగాల నోటిఫికేషన్‌ మరిచిపోయిండని తెలిపారు. 26 వేల ఉద్యోగాలకే నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని కూడా లీకేజీలతో గల్లంతు చేశారని పేర్కొన్నారు.బిస్వాల్‌ కమిటీ చెప్పిన 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Spread the love