తెలంగాణలో రైతులపై దాష్టిక పాలన వైఎస్‌ షర్మిల

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ రైతులపై కేసీఆర్‌ దాష్టిక పాలన కొనసాగిస్తున్నారని వైఎస్‌ఆర్‌ టీపీ అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శనివారం ఒక ప్రకటనలో విమర్శిం చారు. జమీందార్లను, ఉద్యమద్రోహులను ఎమ్మెల్యేలుగా గెలిస్తే వారికి రైతు ల బాధలు ఎలాపడతాయని ప్రశ్నించారు. మహారాష్ట్రలో రైతులు అసెంబ్లీకి పోవాలంటూ చెబుతున్న కేసీఆర్‌ ఇక్కడ రైతుల పరిస్థితిని పట్టించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో 9వేల మంది రైతులు ఆత్మహత్య లు చేసుకున్నారని తెలిపారు. పంట బీమా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వ లేదని ప్రశ్నించారు.నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం విడుదల చేయాలని కోరారు. రాయితీ ఎరువులు, విత్తనాలు సంగతేంటని ప్రశ్నించారు.

Spread the love