అంబర్‌పేటను నగరంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతా

నవతెలంగాణ-అంబర్‌పేట
అంబర్‌పేటను నగరంలోనే ఆగ్రగామి నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ అన్నారు. మంగళవారం కాచిగూడ డివిజన్‌ పరిధిలోని కాశీరాం జీరా లైన్‌లో రూ.25 లక్షలతో చేపట్టిన డ్రయినేజీ పైప్‌ లైన్‌ పనులకు ఎమ్మెల్యే కాచిగూడ కార్పొ రేటర్‌ కన్నె ఉమా రమేష్‌ యాదవ్‌, డాక్టర్‌ శిరీష యాదవ్‌, డాక్టర్‌ ఓం ప్రకాష్‌తో కలిసితో శంకుస్థాపన చేశారు. అనం తరం ఎమ్మెల్యే పాదయాత్రగా పర్యటించి ప్రజలతో మాట్లా డి వారి సమస్యలను అడిగి తెలుసుకుని సానుకూలంగా స్పందించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు అన్ని రకాలుగా మేలు చేసే పనులను చేస్తోంద న్నారు. పాదయాత్ర సందర్భంగా ప్రజలు కోరిన విధంగా వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. వర్షం లేదా వరద వచ్చినప్పుడు బస్తీ వాసుల ఇండ్లల్లోకి వస్తున్న నీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా ప్రత్యేక వరద నీటి పైప్‌ లైన్‌ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ నిచ్చారు. ప్రజల విజ్ఞప్తి మేరకు వీధి మొదట్లో ఉన్న డంపింగ్‌ యార్డ్‌ను అక్కడి నుంచి వేరే చోటుకు మార్పి స్తానని తెలిపారు. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు, పై సమస్యలు తీర్చే విధంగా చర్యలు చేపట్టాలనీ, ఇప్పుడు కాశీరాం జీరా లైన్లో వేస్తున్న డ్రైనేజ్‌ పైప్‌ లైన్‌ పనులు పూర్తయిన వెంటనే, దానిపై రోడ్డు వేయాలని ఆదేశించా రు. ఈ సందర్భంగా తమ సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నందుకు కాశీరాం జీరాలైన్‌ వాసులు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ కాచి గూడ డివిజన్‌ అధ్యక్షులు ఎర్ర భీష్మ దేవ్‌, సీనియర్‌ నాయ కులు దాత్రిక్‌ నాగేందర్‌ బాబ్జి, ప్రధాన కార్యదర్శి కె.సదా నందు, స్థానిక నాయకులు బబ్లు సింగ్‌, అంటో, మన్నే శ్రీనివాస్‌ యాదవ్‌, బద్దుల శ్రీకాంత్‌ యాదవ్‌, సచిన్‌, తదితరులు పాల్గొన్నారు.