అక్రమ కట్టడాలను తొలగించాలని తాసిల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేత

నవతెలంగాణ రెంజల్ 
రెంజల్ తాసిల్దార్ కార్యాలయం లో అక్రమ కట్టడాలను తొలగించాలని రెంజల్ బిజెపి మండల నాయకులు ఆర్ఐ రవికుమార్ వినతిపత్రాన్ని అందజేశారు. 2017లో 340 సర్వే నెంబర్ లో అక్రమంగా స్థలాన్ని కబ్జా చేశారని పలుమార్లు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన వారు పట్టించుకోలేదని, చివరికి తాము హైకోర్టును ఆశ్రయించినట్లు వారు తెలిపారు. గత నెల రోజుల కిందట హైకోర్టు అక్రమ నిర్మాణాలు తొలగించాలని తీర్పు ఇవ్వడం జరిగిందని వారన్నారు. ఇట్టి ఉత్తర్వులను జిల్లా కలెక్టర్, బోధన్ ఆర్టీవో, రెంజల్ తాసిల్దార్ కార్యాలయం పంపడం జరిగింది. కోర్టు ఉత్తర్వుల మేరకు వెంటనే అక్రమ కట్టడాలను తొలగించాలని లేనియెడల బిజెపి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు గోపికృష్ణ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మేక సంతోష్, మాజీ మండల అధ్యక్షులు చుక్క రాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఈర్ల రాజు, లోలపు వడ్డెన్న, సగ్గు రవి, గాండ్ల నాగరాజ్, శివ, యోగేష్, రాకేష్, తదితరులు పాల్గొన్నారు..