అదానీపై ‘జేపీసీ’ వేయడానికి ఎందుకంత భయం

నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
అదానీ అక్రమలపై జేపీసీ వేయాలని కోరుతూ సోమవారం దేశవ్యాప్తంగా ఆర్బిఐ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమాలకు కుత్బుల్లాపూర్‌ నుండి సీపీఐ కార్యకర్తలు హాజరయ్యారు. అదానీ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాడు అని హిడెన్బెర్గ్‌ నివేదిక వచ్చాక వాటిపై జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీ వేసి ప్రజలకు నిజా నిజాలు చెబితే బాగుంటుందని కానీ బీజేపీ, మోడీ ఎందు కు భయపడుతున్నారో అర్థం కావట్లేదన్నారు. దాంట్లో ఎవరి తప్పు లేదని తేలితే ఏదైనా చెప్పుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. జాయింట్‌ పార్లమెంట్‌ కమిటీలో బీజేపీకి చెందిన ఎంపీలే ఎక్కువగా ఉన్నారనీ, అయినా వేయకపో వడం వెనుకల అద్వానీపై మోడీనే సహాయం చేస్తున్నా డని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను బలపరుస్తున్న యన్నారు. గ్లోబల్‌ ప్రచారం చేసుకున్నట్టు ఒకవేళ మోడీ బీజేపీ నిజాయితీ గలవారైతే వెంటనే జేపీసీ వేసి నిజా యితీ నిరూపించుకోవాలన్నారు. అదానీ కంపెనీలోకి ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ ద్వారా రూ.వేల కోట్లు అందులోకి మళ్లించి నేడు అందులో నుంచి సుమారు రూ.70 వేల కోట్లు ఆవిరి అయిపోయాయని ఇదంతా ప్రజల సొమ్ముని అన్నారు. అదానీ నుంచి వసూలు చేసి ప్రజలకు తిరిగి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఇది చిన్న విషయంగా పరిగణిస్తే రానున్న రోజుల్లో ప్రజలకు చెందిన అనేక రూ.లక్షల కోట్లు అదానీ లాంటి వారికి అప్పజెప్పి ప్రజలను దివాలా తీస్తారన్నారు. జేపీసీ వేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు హరినాథ్‌, మండల కోశాధికారి సదానంద, మాజీ కౌన్సిలర్‌ నరసయ్య, మండల కార్యదర్శి శ్రీనివాస్‌, బాచుపల్లి మండల కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్‌, అశోక్‌ రెడ్డి, మల్లేష్‌, ఇమామ్‌, యాదన్న, ఏఐఎ స్‌ఎఫ్‌ కార్యదర్శి శివ పాల్గొన్నారు.