అదానీ దొంగచాటు దందా..!

న్యూఢిల్లీ : అదానీ నౌకాశ్రయాల్లో ఎలాంటి ఒప్పందాలు లేకుండానే దిగుమతుల వ్యవహారాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఎలాంటి టెండర్‌ లేకుండానే ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) గంగవరం పోర్టు ద్వారా దిగుమతులు చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. టెండర్‌ ప్రక్రియ లేకుండానే ఈ వ్యవహారం జరుగుతుందని తృణముల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహు మెయిత్రా ఆరోపించారు. ఎలాంటి సిగ్గు లేకుండా అదానీ కంపెనీలు ఇలాంటి దొంగ చర్యలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. ”టెండర్‌ లేదు, సీవీసీ విధివిధానాలు లేవు, వైజాగ్‌ పోర్టు నుంచి గంగవరం పోర్టుకు వ్యాపారాలను తరలిస్తున్నారు.” అని చమురు శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి, సీవీసీకి మొయిత్రా ట్వీట్‌ చేసింది. కాగా.. గంగవరం పోర్టును ఎల్పీజీ దిగుమతుల కోసం అద్దెకు తీసుకునేందుకు సంబంధించి ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని ఐఓసీ కూడా స్పష్టతను ఇవ్వడం గమ నార్హం. నాన్‌ బైడింగ్‌ ఎంఓయూపై సంతకం చేయడం ద్వారా సౌకర్యాలను ఉపయోగిం చుకుంటున్నట్టు పేర్కొంది. అయితే దీని కోసం ఎటు వంటి టెండర్లు మాత్రం పిలవలేదని స్పష్టతనిచ్చింది. ఏడాదికి ఐదు లక్షల టన్ను ల సామర్థ్యం కోసం చెల్లింపులు చేయడానికి సిద్ధ పడింది. అది తక్కువ పరిమాణంలో ఉన్నా.. ఆ మొత్తానికి చెల్లింపులు చేయాల్సి ఉండటం గమనార్హం. ఐఓసీ ప్రస్తుతం ఏడాదికి దాదాపు 7-8 లక్షల టన్నుల ఎల్‌పిజిని దిగుమతి చేసుకోవడానికి వైజాగ్‌ పోర్టును ఉపయోగి స్తోంది. ఈ వ్యాపారాన్ని తెరచాటున క్రమంగా గంగవరం పోర్టుకు తరలించడం ద్వారా అదానీ పోర్టుకు లబ్ది చేకూర్చినట్ల వుతుందని నిపుణులు పేర్కొంటు న్నారు. కాగా అదానీ గ్రూపు నిర్వహిస్తున్న గంగవరం పోర్టు నుంచి నిబంధనలకు విరుద్ధం గా ఐఓసీ దిగుమతులు చేపట్టడం అంటే అది అదానీకి లబ్ది చేకూర్చడ మేనని కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రెటరీ జైరాం రమేశ్‌ పేర్కొన్నారు.