అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలి..

–  సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్
నవతెలంగాణ-గాంధారి

గాంధారి మండల కేంద్రంలో గురువారం గ్రామ సర్పంచ్ మమ్మాయి సంజీవ్ యాదవ్ గ్రామంలోని అన్ని వార్డులనుసందర్శించారు. మిషన్ భగీరథ నీరు వస్తున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు అలాగే మురికి కాల్వలను పరిశీలించారు విద్యుత్ దీపాల పని తీరును పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు ఎదురవ్వకుండా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలని సర్పంచ్ మమ్మాయి సంజీవ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల వార్డు సభ్యులు, మిషన్ భగీరథ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.