అప్రకటిత ఎమర్జెన్సీ : కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: ప్రధాని మోడీపై వీడియో ప్రసారం చేసినం దునే ఐటీ దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌..తదితర పార్టీలకు చెందిన విపక్ష నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలవుతోందని కాంగ్రెస్‌ విమర్శించింది. బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు చేపట్టడంపై కాంగ్రెస్‌ మండిపడింది. అదానీ వ్యవహారంలో జేపీసీ ఏర్పాటు చేయాలని తాము డిమా ండ్‌ చేస్తుంటే.. కేంద్రం బీబీసీ వెనుకాల పడిందని విమర్శించింది. బీబీసీపై దాడులను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేష్‌ వీడియోను కూడా పోస్ట్‌ చేశారు. బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు…’సైద్ధాంతిక ఎమర్జెన్సీ’ని తలపిస్తున్నాయి” అంటూ అఖిలేష్‌ యాదవ్‌ ట్వీట్‌ చేశారు.