అభివృద్ధికి అడ్డుపడితే చర్యలు తప్పవు

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ అభివృద్ధికి  అడ్డుపడితే  చర్యలు తప్పవని బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబల్ల మల్లేశం  తెలిపారు.  శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు, గ్రామపంచాయతీ పాలకవర్గం తీర్మానం ప్రకారం భిక్నూర్‌ పట్టణంలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని. 30 సంవత్సరాల నుండి కుంటుబడిన పట్టణ అభివృద్ధిని అధిష్టానం సహకారంతో  సెంటర్ లైటింగ్ ఏర్పాటు, డ్రైనేజీ నిర్మాణం  వంటి అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని, అభివృద్ధి పనులకు  అధికార పార్టీ నాయకులు ఎవరైనా అడ్డు వస్తే  పార్టీ నుండి శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.  పార్టీలకతీతంగా  భిక్కనూర్ పట్టణ అభివృద్ధికి  ప్రతి ఒక్కరూ సహకరించాలని  కోరారు.