అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుంది 

– జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్
నవతెలంగాణ అచ్చంపేట: రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తిస్తుందాని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్ అన్నారు. లింగాల మండలం అంబటిపల్లి గ్రామములో రుణమాఫీ లక్ష లోపు మాఫీ అయిన లబ్ధిదారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.ప్రస్తుతం మొదటి దశ లక్ష లోపు మాఫీ అయ్యిందని  రైతులు రుణమాఫీ పై సందేహాలకు, ఫిర్యాదులు ఇవ్వడానికి మండల కేంద్రం లో సహాయక కేంద్రం, రైతు వేదిక లింగాల లో ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయానికి వెళ్లి సందర్శించారు. రుణమాఫీ అయిన రైతులకు మళ్ళీ పంట రుణాలు ఇవ్వాలని సూచించారు. కార్యక్రమం లో వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి, విస్తరణ అధికారి-శివనందు, రైతులు ఉన్నారు.