అశ్రిత పెట్టుబడిదారీ విధానం ఒక ఆర్థిక వ్యూహమైతే?

హిండెన్‌బర్గ్‌ సంస్థ తనపై చేసిన ఆరోపణలు నిజానికి భారతదేశం మీద ఎక్కుపెట్టిన దాడి అని గౌతమ్‌ అదానీ అభివర్ణించడం ప్రాధాన్యత గల అంశం. ఈ ఉదంతం జరగడానికి కొద్ది రోజుల ముందే బిబిసి మోడీ మీద ఒక డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఆ డాక్యుమెంటరీ బ్రిటిష్‌ ప్రభుత్వపు వలసవాద దృక్పథానికి అద్దం పడుతోందని, అందుచేత అది వాస్తవానికి భారతదేశం మీద చేసిన దాడి అని దానికి ముద్ర వేశారు. సరిగ్గా మోడీ ప్రకటించిన మాదిరిగానే తనపై దాడిని మొత్తం దేశం మీదే జరిగిన దాడితో సమానంగా ప్రకటించే ధైర్యం అదానీకి వచ్చిందంటే దానికి కారణం అటువంటి ప్రకటనతో మోడీ పూర్తిగా ఏకీభవిస్తాడనే భరోసా అదానీకి ఉండబట్టే. మోడీ, అదానీ ఇద్దరూ తమని దేశానికి ప్రతిరూపంగా పరిగణించుకుంటున్నారు. కార్పొరేట్‌-హిందూత్వ కూటమికి కేంద్ర బిందువుగా మోడీ-అదానీ కూటమి ఉంది. అందుచేత వారి దృష్టిలో దేశం అంటే వారిద్దరే. ఈ దేశం భవిష్యత్తు బాగుండడం అంటే రాజకీయంగా మోడీ తిరుగులేని స్థానంలో కొనసాగుతూ ఉండడం, ఆర్థిక రంగంలో అదానీ నిరంతరం సంపద పెంచుకుంటూ ఉండడం. వారి దృష్టిలో ఈ రెండూ జరగకపోతే దేశానికి భవిష్యత్తు లేనట్టే.
ఆ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే, మోడీని గాని, అదానీని గాని అనైతికంగా వ్యవహరిస్తున్నారనో, నీతివిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారనో విమర్శించలేం. ఎందుకంటే వారిద్దరూ ఏం చేసినా అది తప్పకుండా దేశ ప్రయోజనాల కోసమే చేసినట్టు. తక్కిన అన్ని అంశాలకన్నా దేశ ప్రయోజనాలే అత్యంత ప్రధానం. దేశ ప్రయోజనాలను కేవలం దేశద్రోహులో, దేశానికి శత్రువులుగా ఉన్నవారో మాత్రమే వ్యతిరేకిస్తారు. కనుక వారిద్దరినీ ఏ విధంగా విమర్శించినా అది దేశద్రోహమే అవుతుంది.
తనను విమర్శించడం అంటే అది దేశ వ్యతిరేకమే అని అదానీ చేసిన ప్రకటనను హిండెన్‌బర్గ్‌ సంస్థ కొట్టిపారేసింది. మోసం చేసినవాడు దేశభక్తి ముసుగు వేసుకున్నంత మాత్రాన చేసిన మోసం చెరిగిపోదని ప్రకటించింది. దేశ ప్రయోజనాలు అంటే ఏమిటో, దేశ భక్తి అంటే ఏమిటో వ్యక్తులతో నిమిత్తం లేకుండా స్వతంత్రంగా ముందు నిర్వచించి ఆ తర్వాత ఆ కొలబద్ద ప్రకారం ఏదైనా ఒక ఘటనను పరిశీలించి అది దేశానికి ప్రయోజనకరమో కాదో నిర్థారించాలి. కాని ఇక్కడ దేశ ప్రయోజనం అంటేనే మోడీ-అదానీ ద్వయం అన్నంతగా మమే కం అయిపోయాక ఇక విమర్శించడం అనేది సాధ్యమే కాదు. తనను తాను సమర్థించుకోడానికి అదానీ వాడుకున్న వాదన ఇదే.
మోడీ ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానం ప్రజల ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది .కేవలం తన ‘ఆశ్రిత’ కార్పొరేట్ల ప్రయోజనాలకోసమే పని చేస్తున్నది. జాతీయ ఆర్థిక సంస్థలైన ఎస్‌బిఐ, ఎల్‌ఐసి వంటి సంస్థలను అడ్డగోలుగా వాడుకుని ప్రయివేటు వ్యక్తుల సామ్రాజ్యాలను నిర్మించుకున్నారు. బడా పెట్టుబడిదారులకు పన్నులలో భారీ రాయితీలను కల్పిస్తున్నారు. దాని వలన ఏర్పడే లోటును పూడ్చుకోడానికి పేద ప్రజల సంక్షేమం కోసం చేయవలసిన ఖర్చులో కోతలు పెడుతున్నారు. మామూలుగా పెట్టుబడిదారుల కోసం పని చేసే ప్రభుత్వాలు కూడా ఆ విధంగా చేయవు. అందుకే ఈ ప్రభుత్వ విధానాలను ‘ఆశ్రిత పెట్టుబడిదారీ’ విధానం (క్రోనీ కేపిటలిజం) అని విమర్శిస్తాం. ఈ ‘ఆశ్రిత పెట్టుబడిదారీ’ విధానాన్ని సమర్థించుకోడానికే వాళ్ళు ”ఇదంతా దేశ ప్రయోజనాలకోసమే’ అన్న సిద్ధాంతాన్ని ముందుకు తెస్తున్నారు. దేశం అంటే ఏమిటో, ఆ దేశాన్ని ఏ విధంగా నిర్మించాలో హిందూత్వ సిద్ధాంతం చెప్పిదానిని వాడుకుంటున్నారు.
కొద్దిమంది ఎంపిక చేసుకున్న వ్యక్తుల సంపదలను పెంచుకోడానికి అనుసరిస్తున్న వికృతమైన తప్పుడు విధానాలను మామూలుగా ఎవ్వరూ బాహాటంగా చెప్పుకోరు, సమర్థించుకోరు. ఒకవేళ తప్పుడు విధానాలను అనుసరించినా, వాటిని ఏదో ఒక విధంగా కప్పిపుచ్చడానికి, చాటుమాటుగా చేయడానికి పూనుకుంటారు. కాని మోడీ హయాంలో ‘ఆశ్రిత పెట్టుబడిదారీ’ విధానం ఏకంగా ఒక ఆర్థిక వ్యూహంగా మారిపోయింది. దానిని కప్పిపుచ్చు కోడానికి మోడీ ప్రభుత్వం ఏమాత్రమూ ప్రయత్నించడం లేదు సరికదా ‘దేశ ప్రయోజనాల’ ముసుగులో సమర్థించుకోజూస్తున్నది.
గతంలో దక్షిణ కొరియాలో కూడా ఇదే విధంగా జరిగిందన్నట్టుగా చరిత్రకారుడు ఆడమ్‌ టూజె వంటివారు అంటున్నారు. కాని అక్కడికీ , ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నదానికీ మౌలికంగానే ఒక తేడా ఉంది. దక్షిణ కొరియాలో గాని, రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం జపాన్‌లో గాని యావత్తు ప్రభుత్వ వ్యవస్థలన్నీ గుత్త పెట్టుబడిదారీ గ్రూపులతో సమన్వయం చేసుకుని వ్యవహరించాయి. ప్రభుత్వం గాని, ప్రభుత్వ వ్యవస్థలు గాని తీసుకునే నిర్ణయాలను గుత్త సంస్థలు నిర్దేశించడం, ఈ వ్యవస్థలన్నీ ఆ గుత్త సంస్థల సంపదలను వృద్ధి చేయడానికి తోడ్పడడం జరిగింది. అయితే అందుకు ఒక వ్యవస్థాపరమైన ఏర్పాటు అమలులో ఉండేది. కాని మన దేశంలో అటువంటి ఏర్పాటు అంటూ ఏదీ లేదు. ఉన్నది కేవలం దేశాధినేతకి, ఆ వ్యాపార దిగ్గజానికి మధ్య ఉన్న సంబంధం మాత్రమే. దాని కారణంగానే ఆ వ్యాపార దిగ్గజానికి సకల వ్యవహారాలూ జరిగిపోతున్నాయి.
ఇక నాజీ జర్మనీలో కూడా పాలక పార్టీకి, వ్యాపార సంస్థలకు మధ్య ఒక సన్నిహిత కూటమి ఉండేది. యుద్ధం ప్రారంభానికి ముందు నాజీ జర్మనీలో ఒక్కో వ్యాపార సంస్థతో ఒక్కో నాజీ నేత సంబంధం పెట్టుకుని వ్యవహరించేవాడు. ఆ వ్యాపార సంస్థలమధ్య పోటీ ఉండేది. ఒకానొక వ్యాపార సంస్థతో సంబంధం కలిగివుండే నాయకుడు గనుక పార్టీలో పట్టు కోల్పోతే ఆ సంస్థ కూడా నష్టపోయేది. లూషినో విస్కాంటీ తీసిన ‘ది డామ్డ్‌’ అన్న సినిమాలో దీనిని బాగా చూపించారు. (ఒకసారి యుద్ధం మొదలయ్యాక ఉత్పత్తి యావత్తూ యుద్ధావసరాలకోసం ఒక కేంద్రీకృత ప్లాన్‌ ప్రకారం జరిగింది.)
అన్ని రకాల ఫాసిస్టు ప్రభుత్వాల పాలనలోనూ గుత్త పెట్టుబడిదారులకు, ప్రభుత్వానికి నడుమ ఒకకూటమి (ఒక లాలూచీ) ఉండడం చూశాం. అందుకే ముస్సోలినీ ”చాజ్యం, కార్పొరేట్‌ శక్తులు కలగలిసిపోవడమే ఫాసిజం” అని నిర్వచిం చాడు. మనదేశంలో సైతం ఇప్పుడు మనం చూస్తున్నది అదే.
అయితే కొద్దిమంది రాజకీయ నాయకులు, మరికొద్దిమంది బడా వ్యాపారవేత్తలు కూడబలుక్కుని వ్యవహరించడం ద్వారా పెట్టుబడిదారీ వ్యవస్థను తమ చిత్తం వచ్చినట్టు నడిపించడం, ఆ వ్యవస్థను పూర్తిగా తమ కనుసన్నలలోనే నడిపించడం సాధ్యం కాదు. ఒక దేశంలోని పెట్టుబడిదారీ వ్యవస్థను తక్కిన ప్రపంచంతో సంబంధం లేనివిధంగా దానిచుట్టూ ఒక కోటగోడను కట్టేయగలిగితే, అప్పుడు ఆ దేశంలో రాజకీయ అధినేత, వ్యాపార దిగ్గజం కలిసి తమ పెత్తనాన్ని చెలాయించడం సాధ్యపడవచ్చునేమో. కాని పెట్టుబడి ప్రపంచీకరణ జరిగిన తర్వాత అటువంటిది సాధ్యం కాదు.
దేశంమీద పట్టు సంపాదించిన తర్వాత ఆ వ్యాపార దిగ్గజం కేవలం దేశీయ ఆర్థిక వ్యవస్థ పరిధిలోపలే తన ఆర్థిక కార్యకలాపాలను పరిమితం చేసుకోడు. అలా పరిమితం అయితే, దేశంలోపల ఉన్న పోటీలో అతడు తన పైచేయిని కోల్పోయే ప్రమాదం ఉంది. తక్కిన వ్యాపార దిగ్గజాలు అతడిని స్వాహా చేసే అవకాశం ఉంటుంది. అందుకే రాజకీయ అగ్ర అధినేత ప్రాపకం సంపాదించిన తర్వాత ఆ వ్యాపార దిగ్గజం అంతర్జాతీయ రంగంలోకి అడుగుపెడతాడు. ఒకసారి ఆ విధంగా అడుగుపెట్టగానే ఇక అతగాడి లావాదేవీలన్నీ అంతర్జాతీయంగా వివిధ దిగ్గజాల పరిశీలనకు గురవుతాయి. అంతర్జాతీయ పోటీలోకి అతడు దిగగానే ఆ అంతర్జాతీయ పోటీ నియమాలన్నీ పాటించవలసివుంటుంది. ఒకవేళ ఆ నియమాలను గనుక అతిక్రమిస్తే వెంటనే అందరిచూపూ అతడిపైన పడుతుంది. అతడు శిక్షకు పాత్రుడౌతాడు. తక్కినవారందరికీ ఏవో నీతి నియమాలు ఉండినందువలన కాదుగాని, ఆయా దిగ్గజాల మధ్య ఉండే పోటీ కారణంగా ఈ విధంగా జరుగుతుంది. ఇప్పుడు అదానీ విషయంలో జరిగిందదే.
అతడి సంస్థను కాపాడేందుకు ప్రభుత్వం తన తోడ్పాటును అందించివుండొచ్చు. కాని ఒకసారి అందరి దృష్టిలో పడి, అంతర్జాతీయ ”అభిప్రాయం” అతడి సంస్థకు ప్రతికూలంగా మారిన తర్వాత అటువంటి తోడ్పాటును కొనసాగించడం కూడా కష్టం అవుతుంది. ప్రతీ దేశ ఆర్థిక వ్యవస్థకూ విదేశీ నిధుల ప్రవాహం కొనసాగడం చాలా అవసరం. ఒకసారి మన దేశ ప్రభుత్వం తప్పుడు పద్ధతులకు పాల్పడిన వ్యాపార దిగ్గజాన్ని నియంత్రించలేని చేతకానితనాన్ని ప్రదర్శించాక విదేశీ మదుపరుల విశ్వాసం మన దేశం మీద లేకుండా పోతుంది. అప్పుడు విదేశీ నిధుల ప్రవాహం తగ్గిపోతుంది. అందువలన విదేశీ వ్యాపార చెల్లింపులలో లోటు పెరుగుతుంది. దాని పర్యవసానాలను తట్టుకోవడం కష్టసాధ్యం అవుతుంది.
ఒకవేళ ఈ వ్యాపారదిగ్గజం ఏదో ఒక విధంగా ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోగలిగినా, మోడీ ప్రభుత్వం ప్రదర్శించే పొగరుమోతు తనం మాత్రం కొనసాగడం కుదరదు. అదానీ వ్యవహారాలమీద విచారణ జరపకుండా ఉండటం అసాధ్యం. అలా జరపకపోతే అంతర్జాతీయ మదుపరులలో మనమీద విశ్వాసం పోతుంది. ఒకవేళ ఏదో నామమాత్రపు విచారణ జరిపి అదానీ ఏ తప్పూ చేయలేదని నివేదికను తీసుకువచ్చినా, అటువంటి విచారణ పట్ల అంతర్జాతీయ పెట్టుబడిదారులలో ఎటువంటి నమ్మకమూ ఉండదు. అందుచేత అదానీలకు ఏదో ఒక శిక్ష తప్పదు. అది చిన్న శిక్షే అయినా, ఆ తర్వాత రాజకీయ అధినేతకు, ఈ వ్యాపారదిగ్గజానికి మధ్య పాత స్థాయిలో లంకె కొనసాడం కష్టం అవుతుంది. తన ‘ఆశ్రితుడికి” శిక్ష పడినతర్వాత దేశ ప్రయోజనాలంటే ఆ ఆశ్రితుడి ప్రయోజనాలే అన్న సిద్ధాంతమూ పలచబడుతుంది. ఒక విధంగా కార్పొరేట్‌- హిందూత్వ కూటమి దూకుడు కొనసాగడం కష్టం అవుతుంది.
పెట్టుబడి ప్రపంచీకరణ క్రమానికి, జాతి రాజ్యానికిమధ్య ఉండే వైరుధ్యం ఈ అదానీ ఉదంతం రూపంలో బైటపడింది. అది హిందూ రాజ్యమే కావొచ్చు. కాని, ప్రపంచీకరణ జరిగే క్రమంలో, అంతర్జాతీయంగా నెలకొన్న పోటీ నడుమ ఒక రాజ్యం ఆ అంతర్జాతీయ పోటీ నిబంధనలకు అతీతంగా వ్యవహ రించడం సాధ్యం కాదు. (స్వేచ్ఛానుసరణ)

ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love
Latest updates news (2024-07-07 04:26):

cbd gummies for anxiety BW0 1000mg | best broad aes spectrum cbd gummies for anxiety | wana cbd uLw sour gummies | sunshower gummies cbd QyM review | cbd 500 mg gummies 7UN | healthy matters cbd 4lP gummies | dr phil dr chB oz cbd gummies | 5000 mg cbd gummies duu | re live cbd gummies jHV | can cbd gummies tdE help with muscle pain | cbd gummies best time to WLc take in the day | koi cbd gummies drug test SNn | who ULl owns natures boost cbd gummies | 10 mg gummies pS2 cbd | cbd gummies most effective tucson | OKC cbd gummies odessa tx | Bcr cbd gummies for copd uk | making gummies with xaB cbd isolate | cbd gummy colombia cbd vape | apple gyP cider vinegar cbd gummies | AG1 the platinum series cbd gummies | Df8 cbd gummies make me hungry | can 77c cbd gummies help tinnitus | do cbd 9gW gummies help lower blood sugar | best 300 eWV mg cbd gummies | GYK 1000mg jar of cbd gummies | green roads cbd gummy chC reviews | 1MP cbd gummy bears not sour | does the Ubf vitamin shoppe sell cbd gummies | cbd TUC gummies in otsego | cbd online shop gummies nerds | cbd gummies prices near Biw me | are cbd fBd gummies legal in italy | pregnant cbd gummies for sale | copd online shop cbd gummies | do fdc cbd gummies work for pain | cbd green otter gummies LBr | bio wellness x gx8 cbd gummies | fire SII wholesale myrtle beach sc gummy cbd | sure BmA botanicals cbd gummies | hemp bombs cbd gummies 12 sjy pack | just R1J cbd gummies reviews | wyld cbd thc WCV gummies | are ktS cbd gummies legal in nz | can n1z cbd gummies help you quit smoking | madison indiana cbd oLV gummy bears | vegan cbd gummies 991 wholesale | mary jane cbd gummies t0T | cheapest WxV cbd gummies reddit | how often can i eat cbd M8q gummies