
అడవులలో అగ్ని ప్రమాదాలను ముందస్తుగా గుర్తించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఉపయోగపడుతుందని పర్యావరణవేత్తలు అన్నారు. అడవులలో అగ్ని ప్రమాదాల నివారణకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఏఐ వినియోగం, దానిపై అవగాహన కల్పించేందుకు శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ టిడిసి సెంటర్లో అటవీశాఖ అధికారులకు సిబ్బందికి అవగాహన కల్పించారు. అభయారణ్యంలోని అటవీ ప్రాంతాలలో ఏఐ ఉపయోగించి ముందుగానే అగ్ని ప్రమాదాలను గుర్తించి అరికట్టవచ్చని వివరించారు. వేసవి సమీపిస్తున్న తరుణంలో అడవులలో జరిగే అగ్ని ప్రమాదాలు నివారించుకోవడానికి, అలాగే అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడానికి ఈ శిక్షణ అటవీశాఖ అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం అడవులలోకి తీసుకువెళ్లి అగ్ని ప్రమాదాల నివారణ అనే అంశం ప్రాక్టికల్ గా చేసి చూపించారు. కార్యక్రమంలో ఎఫ్డిపిటి శాంతారామ్, డి ఎఫ్ ఓ శివ అసిస్ సింగ్, తలపేట ఎఫ్ఆర్ఓ సుష్మారావు, ఇందన్ పల్లి ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్, శిక్షకులు బెంగళూరు వైల్డ్ లైఫ్ స్టడీ సెంటర్ అధికారి నరేంద్రన్ కోదండపాణి ఎఫ్ ఎస్ ఓ లు ఎఫ్బి వోలు ఇతర అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.