ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం ఇవ్వాలి

–   ఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌,
–  ఆశా వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు జయలకి
–  ఇందిరాపార్క్‌ వద్ద మహాధర్నా
–  ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌
నవతెలంగాణ – అడిక్‌ మెట్‌
ఆశా వర్కర్లకు ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణయించి వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ డిమాండ్‌ చేశారు. గురువారం ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిం చారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌, యూని యన్‌ రాష్ట్ర అధ్యక్షులు జయలక్ష్మి మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు 26 వేల మందికి పైగా ఆశా వర్కర్లు పని చేస్తున్నారని తెలిపారు. 18 సంవత్స రాలుగా పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నారన్నారు. వీరంతా మహిళ లు, బడుగు బలహీన వర్గాలకు చెంది న వారు అని.. కంటి వెలుగు, లెప్రసీ తదితర ప్రభుత్వం నిర్ణయించిన అన్ని పనులూ చేస్తున్నారని తెలిపారు. గతంతో పోలిస్తే అనేక రెట్ల పనిభారం పెరిగిందని, కానీ వారికి ఫిక్స్‌డ్‌ వేతనం లేదని, పెన్షన్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, కనీసం ప్రసూతి సెలవులు కూడా ప్రభుత్వం నేటికీ నిర్ణయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇవ్వాలని 106 రోజులు ఆశా వర్కర్లు సమ్మె చేస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిని ప్రగతి భవన్‌కు పిలిపించుకుని.. రూ.6000 ఫిక్స్‌డ్‌ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండా ఆశాలను మోసం చేస్తున్నారని తెలిపారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇస్తున్నట్టు ఆశా వర్కర్ల కు రూ. 10 వేల ఫిక్స్‌డ్‌ వేతనం నిర్ణ యించాలని డిమాండ్‌ చేశారు. పెరి గిన ధరలకనుగుణంగా కనీస వేతనం చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. ఆశాలకు కంటి వెలుగు పెండింగ్‌ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కరోనా రిస్క్‌ అలవెన్స్‌ నెలకు రూ.1000 చొప్పున 16 నెలల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. జిల్లా ఆస్పత్రిలో ఆశాలకు రెస్ట్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, అధికారుల వేధింపు లు అరికట్టి ప్రసూతి సెలవులు ఇవ్వా లని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ మహాధర్నాలో తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి నీలాదేవి, కోశాధికారి గంగమణి, ఎం.శ్రీలత, జి.కవిత, సాధన, హేమలత, ఎ.సునీత, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.