ఇండియన్‌సైకియాట్రిక్ సొసైటీ నేషనల్ డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్‌గా డాక్టర్ ప్రొఫెసర్ విశాల్

నవతెలంగాణ-కంటేశ్వర్  
దేశవ్యాప్తంగా  జరిగిన  ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఎన్నికలలో డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్ గా గెలుపొందినరు ఈ సంస్థ 1947 సంవత్సరంలో స్థాపించబడినది. ఈ సంస్థ ద్వారా దేశవ్యాప్తంగా మానసిక వైద్య అవగాహనపై మత్తుపదార్థాల నివారణకు ఈ సంస్థ కృషి చేస్తుంది. జరిగిన జాతీయ  ఎన్నికలలో 29 రాష్ట్రాల మానసిక వైద్యులు ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం ద్వారా తమ ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ లొ జరిగిన ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ మహాసభలలో  జాతీయ ఎన్నికల అధికారి డాక్టర్ అశోక్ రెడ్డి  ఎన్నికల ఫలితాలను వెలువరించడం జరిగినది.
జాతీయ కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన డాక్టర్ విశాల్  ఆకుల 2023 నుండీ 2026  సంవత్సరము వరకు డైరెక్ట్ కౌన్సిల్ మెంబెర్ గా 1430 ఓట్ల తో విజయం సాధించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల మాట్లాడుతూ.. నా గెలుపునకు సహకరించిన తెలంగాణ రాష్ట్ర మానసిక వైద్యుల సంఘము అధ్యక్షులు డాక్టర్ జార్జి రెడ్డి కి, డాక్టర్ కిషన్ కి డాక్టర్ రఘురాం రెడ్డి కి సభ్యులందరికీ కూడా ధన్యవాదములు తెలిపారు. జాతీయ కార్యవర్గంలో తెలంగాణ రాష్ట్రంఏర్పడిన తర్వాత  ఈ పదవిని చేపట్టిన న మొదటి వ్యక్తిగా డాక్టర్ విశాల్ ఆకుల చోటు సంపాదించడం జరిగినది.