ఇటుక బట్టీల్లో దారుణం

–  బాలికలపై లైంగిక వేధింపులు
–  జీతాలివ్వకుండా ఇబ్బందులు
–  72 మంది ఒడిషా లేబర్‌తో వెట్టిచాకిరీ
–  ఒడిషా సీఎంఓకు ఫిర్యాదు చేసిన కార్మికులు
–  అక్కడి నుంచి సంగారెడ్డి కలెక్టర్‌కు ఈ-మెయిల్‌
–  విచారించిన లేబర్‌ అధికారులు
నవతెలంగాణ-మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఇటుకబట్టీల్లో దారుణం జరిగింది. సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌ మండలం దర్గాతండాలో ఇటుకబట్టీ నిర్వహించే యజమాని దాష్టీకానికి ఒడిషా కార్మికులు బలిపశువులయ్యా రు. కార్మికులతో వెట్టి చేయిస్తూ ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా బాలికలపై లైంగిక వేధింపు లకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చైల్డ్‌ ప్రొటక్షన్‌, కార్మిక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్గా తండాకు చెందిన సర్పంచ్‌ ఎస్‌ఆర్‌కే బ్రిక్స్‌ పేరిట నిర్వహించే ఇటిక బట్టీల్లో పనిచేసేందుకు ఒడిషాకు చెందిన 72 మంది కార్మికులను తీసుకొచ్చారు. ఏడు నెలలుగా బట్టీల్లో పనిచేయిస్తు న్నారు. నాలుగు నెలలుగా కార్మికులకు జీతాల్వికుండా యజమాని ఇబ్బందుల కు గురి చేశారు. ఇటుక బట్టీల్లో పనిచేసే కార్మికుల కుటుంబాల్లో మైనర్‌ పిల్లలు కూడా ఉన్నారు. వేతనాలివ్వకపోవడమే కాకుండా మైనర్లు అయిన ఆడపిల్లలపై లైంగిం కగా వేధింపులకు పాల్పడటంతో విసుకు చెందిన కార్మికులు ఒడిషా సీఎంఓకు పిర్యాదు చేశారు. కార్మికుల ఫిర్యాదుకు స్పందించిన ఒడిషా అధికారులు.. తెలంగాణ రాష్ట్ర సీఎస్‌, కార్మిక శాఖ అధికారులకు మెయిల్‌ రూపంలో ఫిర్యాదు చేశారు. దీంతో సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఎ.శరత్‌కు రాష్ట్ర అధికారుల నుంచి మెయిల్‌ వచ్చింది. వెంటనే స్పందించిన కలెక్టర్‌ జిల్లా లేబర్‌ అధికారులు, స్త్రీ సంక్షేమ, చైల్డ్‌ ప్రొటక్షన్‌ అధికారులు యాదయ్య, రత్నం, నవనీతతో పాటు నారాయణఖేడ్‌ పోలీసులు బుధ వారం ఇటుకబట్టీ వద్ద విచారించారు. ఒడిషా కార్మికుల్ని కలిసి యజమాని పెట్టిన ఇబ్బందుల గురించి ఆరా తీశారు. జీతాలివ్వకుండా ఇబ్బందుల కు గురి చేయడం, బెదిరించడమే కాకుండా ఏడుగురు బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు కార్మికులు వివరించారు. విచారణకు వచ్చిన అధికారుల ముందు బాధిత కార్మికులు గోడు వెళ్లబోసుకున్నారు. కార్మికులు చెప్పిన వివరాలను పరిశీలించిన అధికారులు ఎస్‌ఆర్‌కే బ్రిక్స్‌ ఇటుకబట్టిని సీజ్‌ చేశారు. జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి నవనీత ఫిర్యాదు మేరకు ఇటుకబట్టి యజ మానితో పాటు మరో ముగ్గురిపై బాల కార్మిక చట్టాల ఉల్లంఘనతో పాటు లైంగిక వేధింపులకు సంబంధిం చిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇటుకబట్టిలో పనిచేస్తున్న 72 మంది కార్మికుల్ని అధికారులు ఒడిషాకు పంపారు.