ఇదొక సరదాల గోల..

సంతోష్‌ శోభన్‌, గౌరి జి.కిషన్‌ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వంలో గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని సుష్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈనెల 18న విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మేకర్స్‌ రిలీజ్‌ ట్రైలర్‌తోపాటు బిగ్‌ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, ‘మా సుష్మిత త్వరలోనే మెగా ప్రొడ్యూసర్‌ అవుతుంది. తనతో పాటు విష్ణుకి అభినందనలు. డైరెక్టర్‌ ప్రశాంత్‌ నెరేషన్‌ వినగానే ఎమోషనల్‌ అయ్యాను. స్క్రీన్‌మీదకు అలాగే తీసుకు వస్తాడా? అని అనిపించింది. ఇప్పుడుట్రైలర్‌ చూస్తే తను చక్కగా డైరెక్ట్‌ చేశాడనిపించింది. హీరో సంతోష్‌ నటుడిగా రాణిస్తున్నాడు. ఇక గౌరి చక్కగా నటించింది’ అని తెలిపారు. ‘ఈ సినిమా సరదాగా గోల గోలగా ఉంటుంది. అచ్చమైన తెలుగు సినిమా. ఈనెల 18న వస్తున్న ఈ సినిమాను మీ అందరూ ఫ్యామిలీస్‌తో ఎంజారు చేస్తారు. సుష్మిత అక్కకి థ్యాంక్స్‌’ అని హీరో సంతోష్‌శోభన్‌ అన్నారు. నిర్మాత విష్ణు ప్రసాద్‌ మాట్లాడుతూ, ”ఈ సినిమా ఫన్నీగా ఎంజారు చేసేలా ఉంటుంది. ఈనెల 18న ఫ్యామిలీతో కలిసి ఎంజారు చేయండి. ఈ జర్నీలో ఇప్పటి వరకు సపోర్ట్‌ చేసిన అందరికీ కృతజ్ఞతలు’ అని చెప్పారు. ‘మన లైఫ్‌లో మనం ఎక్స్‌పీరియెన్స్‌ చేసే ట్రూ ఎమోషన్స్‌, రియల్‌ లైఫ్‌ ఫీలింగ్స్‌, మన అమ్మ, నాన్నతో గడిపే క్షణాలు, స్నేహితులు సరదాగా ఉన్న సమయం. ప్రేమలో ఉన్నప్పుడు ఉండే బ్యూటీఫుల్‌ మూమెంట్స్‌ అన్ని ఈ సినిమాలో ఉంటాయి. వీటన్నింటితో పాటు ఫెంటాస్టిక్‌ డ్రామా ఉంటుంది. డైరెక్టర్‌ ప్రశాంత్‌ సిన్సియర్‌గా మనసు పెట్టి సినిమాను చేశారు. తనతో పాటు ఈ సినిమాకు పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్‌ అందరూ అంతేలా మనసు పెట్టి పని చేశారు. సంతోష్‌, గౌరి నాకు ఫ్యామిలీ మెంబర్స్‌లా సపోర్ట్‌ చేశారు. మా డీఓపీ సిద్ధార్థ్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ క్రమాన్‌ సహా అందరూ వారి బెస్ట్‌ ఇచ్చారు. ఇది మా బ్యానర్‌లో వస్తున్న ఫస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌. నాన్న చిరంజీవి ఆశీస్సులతో మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం’ అని నిర్మాత సుష్మిత కొణిదెల తెలిపారు. హీరోయిన్‌ గౌరి జి.కిషన్‌ మాట్లాడుతూ, ‘ఈ సినిమాతో శ్రీదేవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన డైరెక్టర్‌ ప్రశాంత్‌కి థ్యాంక్స్‌. ’96’ సినిమా నాకు యాక్టర్‌గా లైఫ్‌ చేంజింగ్‌ మూవీ. అలాగే ఇప్పుడు తెలుగులో ఈ సినిమా లైఫ్‌ చేంజింగ్‌ మూవీ అనే చెప్పాలి’ అని చెప్పారు.