ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత…

నవతెలంగాణ – జన్నారం
ఇసుక అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకున్నట్లు ఇందన్పల్లి ఎఫ్ఆర్ఓ కారం శ్రీనివాస్ తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందన్ పెళ్లి రేంజ్ పరిధిలోని మన మల్లాపూర్  నుంచి  అక్రమంగా ఇసుక తీసుకొని వెళ్తున్న ట్రాక్టర్ ను  పట్టుకొని ఇందన్ పెళ్లి రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు.