ఈ విద్యాసంవత్సరమే 12 నెలల జీతమివ్వాలి

– సీఎం ప్రకటనకు గెస్ట్‌ లెక్చరర్ల సంఘం హర్షం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్‌ లెక్చరర్లకు 12 నెలల వేతనం వర్తింపుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన చేయడం పట్ల గెస్ట్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు దామెర ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్‌ సోమవారం ఒక ప్రకటనలో హర్షం ప్రకటించారు. టీఎస్‌పీఎస్సీ జేఎల్‌ నోటిఫికేషన్‌లో గెస్ట్‌ లెక్చరర్లకు అనుభవం ప్రకారం వెయిటేజీ కల్పిం చాలని కోరారు. ఈ విద్యాసంవత్సరం నుంచే 12 నెలల వేతనం అమలయ్యేలా చూడాలని తెలిపారు. జేల్‌ రిక్రూ ట్‌మెంట్‌ పూర్తయ్యే వరకు గెస్ట్‌ లెక్చరర్లకు కన్సా లిడేట్‌గా 12 నెలల జీతమివ్వాలని పేర్కొన్నారు. ఈ మేర కు విద్యా మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తగు చర్యలు తీసుకోవాలని కోరారు.