– భూమి కబ్జా చేసానని వస్తున్న ఆరోపణలు అవాస్తవం
– ఆ భూమికి నాకు ఎలాంటి సంబంధం లేదు : కౌన్సిలర్ తుడుం గణేష్
నవ తెలంగాణ- మేడ్చల్
మేడ్చల్ మున్సిపాలిటీ పరిధి కిష్టాపూర్ 4వ వార్డులో గ్రామ కంఠం భూమిని కబ్జా చేశానని వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కౌన్సిలర్ తుడుం గణేష్ అన్నారు.ఆదివారం ఆయన మాట్లాడుతూ శనివారం ఓ వ్యక్తి తనకు సంబంధించిన గ్రామ కంఠం భూమి కబ్జా చేశానని పలు మీడియా కథనాలలో అయ్యిందని అందులో ఎలాంటి నిజం లేదని తెలిపారు.కిష్టాపూర్ గ్రామంలోని గ్రామకంఠం భూమి తన బంధువులదని ఆ భూమికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తన చిన్నాన,పెద్దనాన్నలకు చెందిన భూమి కావడంతో దాని ఆధారంగా తీసుకొని ఒక దళిత నాయకుడు రాజకీయంగా ముందుకు రావద్దని కక్ష పూరీలతో తనపై లేనిపోని రాద్ధాంతాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దళితుడిని కాబట్టే తనపై లేనిపోని ఆరోపణలు సష్టిస్తున్నారని చెప్పారు.తన జీవితం ఎప్పుడు ప్రజా సేవకే అంకితమన్నారు.నిరంతరం ప్రజా సేవ చేసుకొనె తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు.కౌన్సిలర్ గా గెలిచిన నాటి నుండి నేటి వరకు వార్డు అభివద్ధికి కష్టపడుతున్న కానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు.