ఎల్‌ఐసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు చేయూత

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జీవిత బీమా సంస్థ సికింద్రాబాద్‌ డివిజన్‌ మహిళా విభాగం ఆధ్వర్యంలో లక్ష రూపాయలకుపైగా విలువైన వివిధ స్టేషనరీ వస్తువులను (ఎగ్జామినేషన్‌ పాడ్‌, పెన్ను, జామెంట్రీ బాక్స్‌, నోట్‌ బుక్కులు, ఫైల్స్‌ ఫోల్డర్లు, బిస్కెట్‌ ప్యాకెట్లు) కవాడిగూడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పేద విద్యార్థులకు సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆలిండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌ మిశ్రా మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ డివిజన్‌లో ప్రతి ఏటా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం గర్వకారణంగా ఉందన్నారు. బీఎస్‌ రవి మాట్లాడుతూ సమాజ ప్రగతిలో మహిళల పాత్ర మరువరానిదని కొనియాడారు. ఉమెన్‌ సబ్‌ కమిటీ కన్వీనర్‌ ఏ. రాధారాణి కో-కన్వీనర్లు ఏవీ పద్మావతి, వీఎన్‌. రాజ్యలక్ష్మి నేతృత్వంలో లక్ష రూపాల కుపైగా నిధిని ఉద్యోగుల నుంచి సేకరించి స్టేషనరీ వస్తువులు కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కోశాధికారి బీఎస్‌ రవి, జోనల్‌ ఫెడరేషన్‌ ట్రెజరర్‌ శ్రీనివాసన్‌, తెలంగాణ రాష్ట్ర మహిళా కన్వీనర్‌ వి.మైథిలి, సికింద్రాబాద్‌ డివిజన్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంఎన్‌. శ్రీనివాసులు, డీఎస్‌.రఘు, మహిళా నాయకులు ఎన్సీ అనురాధ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. సిటీ బ్రాంచ్‌-8లో పనిచేస్తున్న ఉద్యోగి మోహన్‌ కుమార్‌ విద్యార్థుల ఎత్తును కొలిచే పరికరాన్ని ప్రభుత్వ పాఠశాలకు అందజేశారు.