ఓడ్ కుల సంఘం క్యాలెండర్ ను ఆవిష్కరించిన శాట్స్ చైర్మన్

నవతెలంగాణ -నవీపేట్
ఓడ్ కుల సంఘం నూతన సంవత్సరాల క్యాలెండర్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయులు గౌడ్ ఎల్బీ స్టేడియంలోని తన కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓడ్ కుల సంఘం సమాజంలో అత్యంత అణగారిన సంచార కులమని అందుకే బీసీ -ఏ జాబితాలో చేర్చేందుకు తాను బీసీ కమిషన్ మెంబర్ గా కృషి చేయడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో ఓడ్ కులస్తులకు అన్ని విధాలుగా తన సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పవార్ కైలాష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ శరత్, ఉపాధ్యక్షులు మహితే సంజీవ్, నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రాజు, ఉపాధ్యక్షులు సుధాకర్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.