కబ్జ కోసం.. గ్యాంగ్‌ వార్‌

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, రియల్‌ స్టార్‌ ఉపేంద్ర పాన్‌ ఇండియా మూవీ ‘కబ్జ’ ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ట్రైలర్‌ని అమితాబ్‌ రిలీజ్‌ చేసి, సినిమా చాలా పెద్ద సక్సెస్‌ కావాలని చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. పాన్‌ ఇండియా మూవీగా ‘కబ్జ’ కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ, తమిళ భాషల్లో ఈనెల 17న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఆర్‌.చంద్రు దర్శక నిర్మాణంలో సిద్దేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌, ఆనంద్‌ మోషన్‌ పిక్చర్స్‌, ఇన్‌వెనియో ఆరిజన్‌ బ్యానర్స్‌పై ఈ చిత్రం రూపొందింది. దీన్ని తెలుగులో నిర్మాత ఎన్‌.సుధాకర్‌ రెడ్డి సమర్పకుడిగా, హీరో నితిన్‌ సొంత బ్యానర్స్‌ రుచిరా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎన్‌ సినిమాస్‌ పతాకాలపై రిలీజ్‌ చేస్తున్నారు. ‘బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌, ‘కబ్జ’ ట్రైలర్‌ను చూసి ఇంప్రెస్‌ అయిపోయారు. సినిమా డైరెక్టర్‌ చంద్రుని కలవానుకుంటున్నానని ఆయన అన్నారు. దీంతో దర్శకుడు ఆర్‌.చంద్రు ముంబై వెళ్లి అమితాబ్‌ను ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఐదు భాషల్లో ‘కబ్జ’ ట్రైలర్‌ను అమితాబ్‌ బచ్చన్‌ రిలీజ్‌ చేసి మేకింగ్‌ గురించి అప్రిషియేట్‌ చేశారు. అన్ని భాషల నుంచి ‘కబ్జ’ ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ వస్తుంది. ఆనంద్‌ ఆడియో వారి యూ ట్యూబ్‌ చానెల్‌లో కబ్జ ట్రైలర్‌ను చూడొచ్చు. ‘కబ్జ’ మల్టీస్టారర్‌ మూవీ. ఉప్రేంద్ర, సుదీప్‌, శివ రాజ్‌కుమార్‌ నటించారు. 1960 కాలంలో జరిగిన అండర్‌ వరల్డ్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో ఉపేంద్ర గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో నటించారు. ఈనెల 17న పునీత్‌ రాజ్‌ కుమార్‌ జయంతి సంద్భంగా ఈ సినిమా రిలీజ్‌ అవుతుంది’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.