కలిసి పని చేయడం ఇలా…

ఆఫీసులో భిన్న మనస్తత్వాలు, వ్యక్తిత్వాలు ఉన్నవారితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. మాట పట్టింపులు, చిన్న తగాదాలు సాధారణమే. కొందరి తీరు వల్ల పనిపైనా ప్రభావం పడుతుంది. అలాంటి వారితో సాగాలంటే.. ఇంట్లో చిన్న చిన్న తగాదాలు సాధారణమే కదా. అప్పుడేం చేస్తాం.. వీలైతే సర్దుకుపోతాం లేదంటే అలక చూపిస్తాం. ఆఫీసులో అలకంటే కష్టం. దూరంగా ఉండటమూ సాధ్యం కాదు. కాబట్టి సమస్య ఎంత పెద్దదో ఆలోచించుకోండి. వ్యక్తిగతం కాదనిపిస్తే అంతటితో వదిలేయడమే మేలు. వాదనకు దారితీసిన అంశంపై మళ్లీ మాట్లాడుకోకపోతే ఇంకా మంచిది. ‘మాకు క్షణం పడదు’ కొందరి విషయంలో ఇలా చెబుతుంటాం. మీతో వారి ప్రవర్తన, పనితీరు.. ఇలా ఏం నచ్చట్లేదో ప్రశ్నించుకోండి. పని మెరుగుదలకు ఆవిడ చేసే ప్రయత్నం ఇబ్బంది పెడుతోంటే.. కోపం పెంచుకోవాల్సిన పనీలేదు. కావాలని వంకలు పెట్టడం, ఇబ్బందికరంగా ప్రవరిస్తోంటే చర్యలు తీసుకోవచ్చు. మనకు పిల్లలు, ఇంటి బాధ్యతలుంటాయి. అవి ఇతరులకీ అర్థమవ్వాలనేం లేదు. దీంతో ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండాలని ఆశిస్తుంటారు. లేకపోతే విభేదాలు. వాళ్లే అర్థం చేసుకోవాలి అనుకున్నంత కాలం పరిస్థితిలో మార్పుండదు. కాబట్టి నోరు తెరవండి. ఎంతసేపు మన కోణంలోనే ఆలోచిస్తేనే తేడాలొచ్చేది. అవతలి వాళ్ల గురించీ ఆలోచించాలి. అందరినీ కలుపుకొంటూ వెళ్లాలి. నేను సాయపడను కానీ అందరూ నాకు సహకరించాలన్న తత్వం పనిలోనే కాదు.. పక్కవారితో బంధం ఏర్పరచడంలోనూ చేటే చేస్తుంది. చివరగా.. అన్నింటికీ ఫిర్యాదు చేయడం మంచిది కాదు. నిజమే.. కానీ అవతలి వాళ్లు మిమ్మల్ని టార్గెట్‌ చేస్తున్నా.. అధికార బలంతో ఇబ్బంది పెడుతున్నా.. అదనపు భారం వేస్తున్నా పై అధికారి లేదా హెచ్‌ఆర్‌కి ఫిర్యాదు చేయండి. అప్పుడు సర్దుకుపోవద్దు. ప