నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థి
కోహిమా: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. కాగా, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుంది. మార్చి 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అకులుటో స్థానం నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఖేకషే సుమీ తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరిరోజైన శుక్రవారం.. ఆఖరి క్షణాల్లో తాను పోటీనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అనంతరం, తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి కఝెటో కినిమీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న ఇద్దరిలో ఒకరు తప్పుకోవడంతో 68 ఏండ్ల కినిమీ యునానిమస్‌గా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కినిమీ ఎమ్మెల్యేగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. కాగా, నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుంది. మార్చి 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.