కాజీపేట-బలార్షా రూట్లో పలురైళ్లు రద్దు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌లోని కాజీపేట-బలార్షా సెక్షన్‌లో ఈనెల 15 నుంచి 24, 25 తేదీల వరకు పలు రైళ్ళను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. ఈ రూట్లో మూడవ లైన్‌ కనెక్టివిటీ నాన్‌ ఇంటర్‌ లాకింగ్‌ పనులు కొనసాగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రయాణీకులు రైల్వే ఎంక్వైయిరీ ద్వారా ఆయా రైళ్ల వివరాలను తెలుసుకోవచ్చని చెప్పారు. పై రూట్లో 17 రైళ్లు పూర్తిగా, 7 రైళ్లు పాక్షికంగా రద్దు అయినట్టు తెలిపారు.