కేంద్రం అందరితో ఎందుకు పోరాడుతుంది?

– అందరితో గొడవపెట్టుకుంటే దేశం అభివృద్ధికాదు : కేజ్రీవాల్‌
న్యూఢిల్లీ : ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవద్దని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచించారు. సోషల్‌మీడియా వేదికగా ఆయన శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. న్యాయమూర్తుల నియామకంపై సుప్రంకోర్టు, కేంద్రానికి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీనికి సంబంధించిన ఓ వార్తా నివేదికను ఉటంకిస్తూ.. ‘కేంద్ర ప్రభుత్వం అందరితో ఎందుకు పోరాడుతుంది? న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు, రైతులు, వ్యాపారులతో.. ఇలా అందరితో గొడవలు పెట్టుకుంటే దేశం అభివృద్ధి చెందదు. మీ పని మీరు చేయండి… ఇతరుల్ని కూడా వారు చేసే పనులను వారిని చేసుకోనివ్వండి. ఇతరుల పనిలో జోక్యం చేసుకోకండి’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.