కొత్త బిసి కులాలను ఓబీసీలో చేర్చాలని వినతి

నవతెలంగాణ-నవీపేట్
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బీసీ జాబితాలో చేర్చిన 17 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని సంఘం ప్రతినిధులు రాజ్యసభ సభ్యులు బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మన్ ను ఢిల్లీలో కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 17 కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చి రెండు సంవత్సరాలైనా ఓబీసీ జాబితాలో కేంద్ర ప్రభుత్వం చేర్చకపోవడం వలన కేంద్ర ప్రభుత్వ విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నామని అన్నారు. అలాగే సంచార జాతుల కోసం కేంద్రం ప్రవేశపెట్టిన సీడ్ పథకంలోని కులాలలో సైతం 13 కులాలను చేర్చాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో డిఎన్టి డెవలప్మెంట్ బోర్డ్ మాజీ సభ్యులు తుర్క నర్సింహ, ఓబీసీ మోర్చా డిఎన్టి సెల్ రాష్ట్ర కో కన్వీనర్ పిల్లి సంజయ్ కిరణ్ మరి మోహన్ చౌహన్ తదితరులు పాల్గొన్నారు.