క్రీడలు సమిష్టి కృషికి సోపానాలు : సీఐ జానకి రాంరెడ్డి

నవతెలంగాణ-బెజ్జంకీ
క్రీడల్లో గెలుపోటములు సహాజమని క్రీడా స్ఫూర్తిని చాటాడానికి జట్టులోని సభ్యుల సమిష్టి కృషికి సోపానాలుగా నిలుస్తాయని సీఐ జానకి రాంరెడ్డి అన్నారు. అదివారం మండల కేంద్రంలో బెజ్జంకి క్రికెట్ అసోసియేషన్ అద్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ క్రీడా పోటీల్లో పోలిస్, ప్రెస్ మరియు పోలీటీకల్ జట్లు తలపడ్డాయి. పోలీటీకల్ జట్టుపై పోలిస్, ప్రెస్ జట్టు 25 పరుగులతో గెలుపొందగా ఎస్ఐ నరేశ్ రెడ్డి మ్యాన్ ఆప్ ది మ్యాచ్ గా ఎంపికయ్యారు. నిర్వహాకులతో కలిసి సీఐ జానకి రాంరెడ్డి ఎస్ఐకి మ్యాన్ ఆప్ ది మ్యాచ్ ఆవార్డ్ అందజేశారు. అయా పార్టీల నాయకులు, నిర్వహాకులు పాల్గొన్నారు.