ఖదీర్‌ చివరి వీడియోను మరణ వాంగ్మూలంగా స్వీకరించాలి

– టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ట్వీట్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మహ్మద్‌ ఖదీర్‌ చివరి వీడియో మరణ వాంగ్మూలంగా స్వీకరించాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి కోరారు. ఐదురోజులుపాటు పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మరణించారని పేర్కొన్నారు. ఆదివారం ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు. తప్పును కప్పిపుచ్చుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణమైన సంఘటన తనను కలిచివేస్తున్నదని తెలిపారు. మహ్మద్‌ ఖదీర్‌ కుటుంబానికి రూ. 50లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
సాయన్న మరణం పట్ల రేవంత్‌ దిగ్భ్రాంతి
కంటోన్మెంట్‌ శాసన సభ్యులు సాయన్న మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సాయన్న కుటుంబానికి తన సానుభూతి వ్యక్తం చేశారు.