ఖమ్మంలో వందే భారత్‌ రైలుపై రాళ్ల దాడి

– సీసీ కెమెరాలలో నిందితుల గుర్తింపు?
నవతెలంగాణ-ఖమ్మం
వందే భారత్‌ రైలుపై శనివారం ఖమ్మం రైల్వే స్టేషన్‌ సమీపంలో రాళ్ల దాడి జరిగింది. రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆకతాయిలు రాళ్లతో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో సీ12 కోచ్‌ విండో ఎమర్జెన్సీ గ్లాస్‌ ధ్వంసమైంది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆకతాయిలు రైలుపై రాళ్లు విసిరిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్టు సమాచారం. ఆర్‌పీఎఫ్‌ పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం.