నవతెలంగాణ – తొగుట
గడువులోపు కులగణన సర్వే డేటా ఎంట్రీ పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ (రెవిన్యూ) అబ్దుల్ హమీద్ అధికారులను ఆదేశించారు. ఆదివారం స్పెషల్ క్యాంపైన్ డే సందర్బంగా మండలంలో పరి యటించారు. వెంకట్రావుపేట 134,135 పోలింగ్ బూతులను సందర్శించి, ఓటర్ నమోదు కార్యక్ర మాన్ని పరిశీలించారు. అనంతరం ఎంపీడీఓ, తహశీల్దార్ కార్యాలయలలో కులగనన సర్వే డేటా ఎంట్రీ పరిశీలించారు. అధికారులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. తర్వాత కార్యాలయ సిబ్బంది నీ డేటా ఎంట్రీ పూర్తి చేయాలని ఆదేశిం చారు. ఆయన వెంట తహశీల్దార్ శ్రీకాంత్, అర్ఐ అశోక్ రాజ్, ఎంపీవో, ఇరు శాఖల సిబ్బంది, బిఎల్ఓ లు వీణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.