గుడిసె వాసుల పోరాటానికి అండగా ఉంటాం

ఎస్ వీరయ్య ప్రజాసంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్
నవతెలంగాణ-గోవిందరావుపేట
భూస్వాములను తరిమికొట్టండి మండలంలోని పసర పంచాయతీలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసిన గుడిసె వాసుల పోరాటానికి సిపిఐ పార్టీ అండగా ఉంటుందని ప్రజా సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్ వీరయ్య అన్నారు. సోమవారం గుడిసె వాసులు సిపిఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి వీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గుడిసవాసులు ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని వాస్తవంగా ఈ భూమి ఏ భూస్వామికి చెందినది కాదని ఇది భూస్వాముల భూమి కాదని వారెవరు కూడా 40 సంవత్సరాల నుంచి కాస్త కబ్జాలో లేరని జూన్ 2022 ఐటీడీఏ ఏటూర్ నాగారం పిఓ తీర్పు ఇచ్చిన భూస్వాములు ఆగడాలు ఎక్కువయ్యాయని ఇప్పటికే గుడిసె వాసుల కమిటీల మీద సిపిఎం పార్టీ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే అది పేద ప్రజలకు చెందుతుందని సర్వే నెంబర్ 109 కూడా గత 20 సంవత్సరాలుగా సిపిఎం పార్టీ అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించిందని భూస్వాముల తరిమికొట్టి అయినా ఈ భూమి మీదకు రాకుండా ఐక్యంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో వరంగల్ జిల్లాలోని జక్కులుద్దిలో తెల్లవారుజామున 3 గంటలకు దాడి చేశారని గర్భిణీ స్త్రీలను సైతం కొట్టారని పేర్కొన్నారు. అన్ని దాడులు ఎదుర్కొంటూ రాష్ట్రంలో సిపిఎం పార్టీ గుడిసె వాసుల తరఫున పోరాటాలు నిర్వహిస్తుందని పసర లో నిర్వహిస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రజా సంఘాల ఐక్యవేదిక అండగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 కేంద్రాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలు ఇండస్థలాల పోరాటం నిర్వహిస్తున్నారని వీరందరికీ పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని లేదా ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో గుడిసె వాసులకు పట్టాలు వచ్చేవరకు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూమ్ గృహం ఇస్తామన్న సీఎం మాటకు కట్టుబడి ఉండాలని అన్నారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకునే హక్కు ప్రతి పేదవానికి ప్రభుత్వమే కల్పించాలని ఈ సందర్భంగా అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి తుమ్మల వెంకటరెడ్డి, కాసు మాధవి సిఐటియు రాష్ట్ర నాయకులు, బి రెడ్డి సాంబశివ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ,పొదిళ్ల చిట్టిబాబు తీగల ఆదిరెడ్డి సిపిఎం జిల్లా నాయకులు అంబాల పోషాలు అంబాల మురళి, కడారి నాగరాజు, సప్పిడి యాదిరెడ్డి, రాజేశ్వరి, రమేష్, రాజు, సువర్ణ, శారద, తదితరులు పాల్గొన్నారు.