గుప్పెడు బియ్యం కార్యక్రమంలో సహాయం అందజేత

నవతెలంగాణ- ఆర్మూర్ 

మున్సిపల్ పరిధిలోని సిద్ధి వినాయక ఆర్ పి గంగామణి  ఆధ్వర్యంలోగుప్పెడు బియ్యం లో భాగంగా మామిడి పల్లికి చెందిన ఇర్ఫాన్ అనే యువకుడు బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నడని తెలుసుకొని వారి కుటుంబానికి 80 కేజీల బియ్యాన్ని గురువారం అందజేసినారు. తోచిన ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంఘ సభ్యులు శ్రీమతి పల్లవి, పద్మ, శిరీష, వాణి ,జమున తదితరులు పాల్గొన్నారు. ఇలాగే గుప్పెడు బియ్యం లో భాగంగా ప్రతి నెల నిరుపేదలకు గుర్తించి వారికి మాకు తోచిన విధంగా సహాయం చేయడం జరుగుతుందని తెలుపుచున్నాము. దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం అందించిన మరింత ఎక్కువ మందిని గుర్తించి వారికి మా వంతు సహాయం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు.