గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గా మాధవరావు

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఉన్న   తెలంగాణ బాలుర గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల  ప్రిన్సిపల్ గా ఇస్లావత్ మాధవరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో పనిచేసిన ప్రిన్సిపల్ వెంకటరమణ బదిలీపై వెళ్ళగా ఖమ్మం జిల్లా నుండి నూతన ప్రిన్సిపాల్ గా విచ్చేసిన ఇస్లావత్ మాధవరావుకు గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.  ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాధవరావు  మాట్లాడుతూ.. సొసైటీ నిర్ణయాలు అమలు చేస్తూ టీచింగ్, నాన్ టీచింగ్, తల్లిదండ్రుల కమిటీల తో పాటు ఉపాధ్యాయుల పలువురి సహాయ సహకారాలతో ముందుకు సాగుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లెక్చరర్లు గురుకుల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.