గూడెంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన..

నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని గూడెం గ్రామంలో రూ.20 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ దేవా రాజశ్రీతో కలిసి జెడ్పీటీసీ కనగండ్ల కవిత గురువారం శంకుస్థాపన చేశారు. ఎఎంసీ చైర్మన్ రాజయ్య, వార్డ్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, పంచాయతీ కార్యదర్శి లావణ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.