నవతెలంగాణ-అంబర్‌పేట
గోల్నాక డివిజన్ నగరంలోని అత్యున్నత ఆదర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం గోల్నాక డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రెండేండ్ల నుంచి డివిజన్ అభివృద్ధి కోసం డ్రయినేజీ, తాగునీటి అవసరాలకు అనుగుణంగా రూ.20 కోట్ల నిధులు కేటాయించి డివిజన్‌లో ఉన్న సమస్యలను 70శాతం పరిష్కరించామనీ, మరికొన్ని పనులు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నత్తనడక సాగుతున్నాయనీ, త్వరలోనే వాటిని కూడా పరిష్కరిస్తానని తెలిపారు. త్వరలోనే గోల్నాకలో కేసీఆర్ పార్కు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆర్కే బాబు, నర్సింగ్ యాదవ్, గాజుల గోపాల్, లక్ష్మణ్ గౌడ్, గోపాల్ రెడ్డి, చిన్నా, తదితరులు పాల్గొన్నారు.