నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆయన విగ్రహానికి డిసిసి ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుపరి భీమ్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు కుంట లింగారెడ్డి, మాజీ జిల్లా సెక్రెటరీ చేపూరి రాజు, పార్టీ సీనియర్ నాయకులు మద్ది సూర్యకాంత్ రెడ్డి, జిల్లాల రాజు, ఏనుగు మురళి, వడ్డే శశి, శ్రీకాంత్ రెడ్డి, ఈరేఖర్ ఓం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.