వీరనారి చాకలి ఐలమ్మ 129 జయంతిని రజక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అమరవీరుల స్తూపం వద్ద, రజక సంఘం కుల సంఘ పెద్ద గాజా కుమారస్వామి, పెద్ద పెండ్యాల గ్రామంలో మడేల్లయ్యా రజిక సంగం ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి చేసిన పోరాటాలను స్మరించుకొని స్వీట్లు,పండ్లు పంపిణీ చేశారు. అనంతరం టపాసులు కాల్చి ఆమెకు ఘన నివాళిని అర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మొగిలిచర్ల సురేందర్, ప్రధాన కార్యదర్శి మర్రి కుక్కల నరేందర్,సహాయ కార్యదర్శి నేరెళ్ల అనిల్,కార్యవర్గ సభ్యులు తాడూరు యాకయ్య, బంగాళాపల్లి రమేష్,మాజి అధ్యక్షులు నేరెళ్ల సంపత్, నాయకులు నేరెళ్ల రవి,నేరెళ్ల యాదగిరి, కుల పెద్దమనిషి గాజా కుమారస్వామి, జాలియాపు శ్రీనివాస్, గాజా పెద్ద వెంకటేష్, గాజ చిన్న వెంకటేష్, కొలిపాక రాజేష్,సభ్యులు నేరేళ్ల శేఖర్,వంగలపల్లి రాములు,తదితరులు పాల్గొన్నారు.