ఘనంగా శ్రీ సంత్ గురు రవిదాస్ జయంతి వేడుకలు

నవతెలంగాణ-భిక్కనూర్
భిక్కనూర్ పట్టణంలో శ్రీ సంత్ రవిదాస్ జయంతి వేడుకలను జిల్లా మోచీ సంఘం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మోచీ సంఘం జిల్లా అధ్యక్షుడు గడ్డమీది సత్యనారాయణ శ్రీ సంత్ గురు రవిదాస్ చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన  మాట్లాడుతూ  శ్రీ సంత్ గురు రవిదాస్ చేసిన  సేవల గురించి కొన్నియడారు. ఈ కార్యక్రమంలో  ఉపాధ్యక్షుడు గడ్డమీది యాదగిరి, సింది కారి రాజబాబు,  ప్రధాన కార్యదర్శి సిందికారి స్వామి, కార్యవర్గ సభ్యులు కొత్తపల్లి నరేష్, సిందికారి సురేష్,  మమ్మారి రాజశేఖర్, గడ్డమీది భాను ప్రకాష్,  తదితరులు పాల్గొన్నారు.