– ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
నవతెలంగాణ-ధర్మసాగర్
మండలంలోని తాటికాయల గ్రామంలో పరిశుద్ధ ఫాతిమా మాత నూతన దేవాలయా నిర్మాణానికి మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేతుల మీదుగా ఆదివారం శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక విచారణ ఫాదర్ పూదోట దాసయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.కష్టపడితే సాధ్యపడనిదంటూ ఏది లేదని, అందరూ సమిష్టిగా కృషి చేసి చర్చిని అతి త్వరగా నిర్మించుకోవాలని ఆకాంక్షించారు. చర్చి నిర్మాణానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫాదర్లు బాలశౌరి, థామస్ కిరణ్,స్థానిక సర్పంచ్ పెసరు రమేష్, ఎంపిటిసి ననుబాల సోమక్క చంద్రమౌళి, ఉపసర్పంచ్ బొల్లెపాక అన్నపూర్ణ కుమార్, పెద్దపెండ్యాల మాజీ ఎంపీటీసీ తోట నాగరాజు, రాయగూడెం సర్పంచ్ వాంకుడొతు రాజమని మోగిలి,చర్చి నిర్మాణ కమిటీ అధ్యక్షులు ఎర్ర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి బొల్లెపాక రాజేష్, సంఘ పెద్దల అధ్యక్షుడు ఎర్ర రాజు, మాదిగ కుల సంఘం అధ్యక్షుడు పట్ల మీస రాజయ్య,డాన్ బొస్కో యూత్ అధ్యక్షుడు జీడీ శ్రీకాంత్, ఉపదేశి పట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.