చిఫ్‌విప్‌ దాస్యం విస్తృత పర్యటన

– పలు అభివృద్ధి పనులకు
– శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ -హనుమకొండ చౌరస్తా
కాలనీ దర్శన్‌ అనే వినూత్న కార్యక్రమంలో భాగంగా 53వ డివిజన్‌లో ఆదివారం ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినరు భాస్కర్‌ సుడిగాలి పర్యటన చేశారు. దాదాపు రూ.3కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప నలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరంకాంగ్రెస్‌, బీజేపీ నుంచి 500మంది డివిజన్‌ యువత, పెద్దలు బీఆ ర్‌ఎస్‌లో చేరారు. అనంతరం కెయు క్రాస్‌ రోడ్డులోని భారతి విద్యా భవన్‌ దగ్గర ఏర్పాటు చేసిన డివిజన్‌ పబ్లిక్‌ మీటింగ్‌లో చీఫ్‌విప్‌ పాల్గొని ప్రసంగించారు. 53వ డివిజన్‌ను ఆదర్శ డివిజన్‌గా తీర్చుదిద్దెందుకు కషి చేస్తున్నామని అన్నారు. ఓట్ల కోసం ఎన్నడూ కనపడని వారు సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నార న్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్క రించేందుకు పలు కార్యక్రమాలు రూపొందించామన్నారు. రాబోయే రోజుల్లో డివిజన్‌కు మరిన్ని నిధులను తీసుకొచ్చి అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం వయోవద్ధు లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతు రుణ విమోచన కమిషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంకన్న, కార్పొరేటర్‌ సోదా కిరణ్‌, డివిజన్‌ అధ్యక్షులు మూర్తుజ, పార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి విజరుకుమార్‌, ఎండీ ఖాసీం, అలువాల ఎల్లేష్‌, కాకతీయ యూనివర్సిటీ ఆచార్యులు సంగాని మల్లేశ్వర్‌, మైనారిటీ నాయకులు, డివిజన్‌ ముఖ్య నాయకులు, కాలనీల కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ఎజెండా పరకాల : ప్రజా సంక్షేమమే ఎజెండాగా బీఆర్‌ఎస్‌ పనిచేస్తుందని ప్రభుత్వ చీఫ్‌విప్‌ ధ్యాసం వినరుభాస్కర్‌, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడి అన్నారు. ఆదివారం మండలం లోని వెలంపల్లి గ్రామం నుంచి బీఆర్‌ఎస్‌ నాయకులు, విద్యా సంస్థల అధినేత నేతాని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కొందరు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత రం వారు మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నిరుపేదల అభివద్ధి ఎజెండాగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అభివద్ధి చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. నేడు ప్రపంచ స్థాయిలో తెలంగాణ అభివద్ధి ఆకాంక్షను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో ఇక ఎవరు ఉండబోరని అన్నారు. నాయకులు సమ్మిరెడ్డి పాల్గొన్నారు.