
పేద ప్రజల మనసుల్లో గుడికట్టుకొని రాజకీయాలకే కొత్త హంగులు తెచ్చి తనదైన ముద్రవెసుకొని మాట తప్పని, మడిమ తిప్పని మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం మోహన్ రెడ్డి ఏనుగు సుభాష్ రెడ్డి ఎంపీటీసీల ఫోరం జిల్లా మాజీ అధ్యక్షులు మహ్మద్ రియాజుద్దీన్ అన్నారు. సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి వేడుకలను మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా అతని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రైవేటు సుపత్రి రోగులకు పండ్లను బ్రెడ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి మహానేతగా ఎదిగి పేదల పెన్నిధి గా ఆరోగ్య శ్రీ ప్రధాతగా ఫీజు రియంబర్స్మెంట్ తో ఎంతోమంది విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా పోలీసులుగా తీర్చిన మహానుభావుడు అన్నారు. పేదలకు వారు చేసిన సేవలను కొనియాడారు అతని ఆశయ సాధన కోసం కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో మాజీ మండల కో ఆప్షన్ మెంబర్ ఫసి ఉల్లా ముత్యం రాజన్న రియాసత్ అలీ మోసిన్ ఖాన్ నోముల రాజ్ కుమార్ రాజ్జాక్ లకావత్ తిరుపతి ఇమ్రాన్ షేక్ గంగన్న ఖలీం తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.